యూకేలో ఇప్పట్లో లాక్‌డౌన్‌ సడలింపు లేనట్లే

యూకేలో ఇప్పట్లో లాక్‌డౌన్‌ సడలింపు లేనట్లే

లాక్‌డౌన్‌ను జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్టు యునైటెడ్ కింగ్‌డ‌మ్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు...ఇంటి నుండి పని చేయలేని వ్యక్తులు కార్యాలయానికి తిరిగి రావచ్చని పిఎం తెలిపారు...కాని ప్రజా రవాణాను నివారించండి అన్నారు...ఈ వారంలో లాక్‌డౌన్ ఎత్త‌వేయ‌లేమ‌ని బోరిస్ జాన్సన్ స్ప‌ష్టం చేశారు...ఐదు స్థాయిలతో కూడిన కొత్త కరోనా హెచ్చరిక వ్యవస్థ ,లాక్డౌన్ పరిమితులను ఎంత త్వరగా సడలించగలదో ఆయన చెప్పారు...జూన్ 1 నుంచి కొన్ని ప్రాథమిక పాఠశాలలు, దుకాణాలను తెరుచుకుంటాయ‌ని జాన్సన్ చెప్పారు.

దేశాన్ని ఉద్దేశించి ఒక ప్రసంగంలో, జాన్సన్ ఈ దశలో దుకాణాలను తిరిగి తెరుచుకుంటాయని, కాని సైన్స్ మద్దతు ఇస్తేనే ఇది జరుగుతుందని హెచ్చరించారు....తదుపరి దశలో కొన్ని ఆతిథ్య వ్యాపారాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలు తిరిగి తెరవబడతాయన్నారు.. కానీ జూలై 1 కంటే ముందు  ఈ సడలింపులు ఉండవని స్పష్టం చేశారు...ఈ వారం లాక్డౌన్ ముగించడానికి ఇది సమయం కాదని, బదులుగా లాక్‌డౌన్ ఎత్తివేత‌ను వ్యూహాత్మ‌కంగా అమ‌లు చేస్తామ‌ని జాన్సన్ చెప్పారు.

లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై జరిమానాలు పెరుగుతాయని జాన్సన్ ధృవీకరించారు..ప్రతి ఒక్కరూ  మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని తెలిపారు...ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ పార్కులు,బీచ్‌లకు వెళ్లడానికి అనుమతించబడతారని అధికారి తెలిపారు...యూకేలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది..అందువల్ల ఇప్పట్లో నిబంధనలు ఎత్తివేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని,కేసుల పెరుగుదలో తగ్గుదల లేకుంటే  ఆంక్షలు పెంచుతామ‌ని జాన్సన్ స్పష్టం చేశారు.