నెల్లూరులో జైలులో క‌ల‌క‌లం.. 75 మంది ఖైదీల‌కు పాజిటివ్‌

నెల్లూరులో జైలులో క‌ల‌క‌లం.. 75 మంది ఖైదీల‌కు పాజిటివ్‌

నెల్లూరు జిల్లా జైలులో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది.. జైలులో మొత్తం ఖైదీలో 450 మంది ఉండ‌గా.. వీరిలో 75 మందికి ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు.. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జైలు అధికారులు కొంద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. చాలా మందిని జైలులోనే క్వారంటైన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రోవైపు.. నెల్లూరు జిల్లాలో రోజురోజుకీ క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 8578కు చేరింది.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 5783గా ఉండ‌గా.. 2795 క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. మ‌రోవైపు ఇప్ప‌టి వ‌ర‌కు 115 మంది మృతిచెందారు.. జిల్లాలోని కోవిడ్ వార్డులు, కోవిడ్ సెంట‌ర్ల‌లో 3134 బెడ్స్ ఏర్పాటు చేయ‌గా.. ప్ర‌స్తుతం 1791 బెడ్స్‌పై క‌రోనా బాధితులు ఉన్నారు.. ఇక‌, నెల్లూరు సిటీలో ఆదివారం మాంసపు దుకాణాలు బంద్ చేశారు అధికారులు.