చైనాలో కొత్త తరహాలో కరోనా పంజా.. రెండు పట్టణాల్లో లాక్‌డౌన్‌..!

చైనాలో కొత్త తరహాలో కరోనా పంజా.. రెండు పట్టణాల్లో లాక్‌డౌన్‌..!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది.. 2019లో చైనాలో మొదలైన కరోనా మళ్లీ మళ్లీ కొత్త తరహాలో పంజా విసురుతూనే ఉంది. చైనాలో మరోసారి కోరనా తన పంజా విసురుతోంది. జిలిన్, షులాన్ పట్టణాల్లో కరోనా కేసులు పెరిగిపోవడంతో వుహాన్ తరహా లాక్‌డౌన్‌ను విధించారు. ఈ పట్టణాల్లో వ్యాపించిన వైరస్ జన్యు మార్పులు చేసుకున్న కరోనావైరస్‌గా భావిస్తున్నారు. ఈ మార్పుల వల్ల వుహాన్ వైరస్ కంటే… ఈ వైరస్ ప్రమాదకరంగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా చైనా వ్యాప్తంగా 31 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ వచ్చింది. అందులో 28 కేసులు వుహాన్‌లోనివే. మహమ్మారిని నిలువరించడానికి ఇప్పటిదాకా ఎలాంటి వ్యాక్సిన్ గానీ, డ్రగ్స్ గానీ అందుబాటులోకి రాలేదు. ఫలితంగా- లాక్‌డౌన్ వంటి నివారణ చర్యలు తప్ప పూర్తిస్థాయిలో దాన్ని అరికట్టలేకపోతున్నాయి ప్రపంచదేశాలు.