ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు కరోనా...

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు కరోనా...

కరోనా ఎవరిని వదిలిపెట్టడం లేదు. అయితే మన దేశం లోకూడా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే అక్కడ సింగర్ కనికా కపూర్ కరోనా సోకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ నిర్మాతకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మాత కరీం మొరానీ ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది అయితే ఇప్పుడు తాజాగా మొరానీ కి కూడా కరోనా పాజిటివ్ రావడం తో బాలీవుడ్ షాక్ కు గురయ్యింది. ఇక ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారట. ప్రస్తుతం కరీం మిగితా కుటుంబసభ్యులు అందరూ హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయితే మార్చి మొదటి వారంలో శ్రీలంక నుండి తిరిగి వచ్చిన ఆయన మొదటి కూతురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత రాజస్థాన్ నుండి తిరిగి వచ్చిన ఆయన రెండవ కూతురుకి కరోనా పాజిటివ్ వచ్చింది. అందువల్ల వారి నుండే ఈయనకు కరోనా సోకినట్లు భావిస్తున్నారు.