సైబర్ టవర్స్ దగ్గర కరోనా అంటూ హల్‌చల్...పోలీసులు బెంబేలు !

సైబర్ టవర్స్ దగ్గర కరోనా అంటూ హల్‌చల్...పోలీసులు బెంబేలు !

హైదరాబాద్ సైబర్ టవర్స్ దగ్గర ఓ యువకుడు తనకు కరోనా వచ్చిందంటూ హల్‌ చల్ చేశాడు. నాకు కరోనా లక్షణాలు ఉన్నాయి. వందకు డయల్ చేసిన ఎవరు పట్టించుకోవడం లేదంటూ పోలీసులను కోరాడు. 100, 108 కి కాల్ చేసినా పట్టించుకోవడం లేదని గాంధీకి తీసుకెళ్ళండని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో పోలీసులు భయాందోళన కు గురవుతున్నారు. అప్పటిదాకా అబ్బాయిని 2 దెబ్బలు కొట్టిన ఎస్సై, ట్రాఫిక్ ఎస్సై ఇద్దరికీ భయం పట్టుకుంది. కొట్టిన లాఠీలు పక్కన పెట్టి, శానిటైజర్ తో కడుక్కున్నారు. ఆ యువకుడిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.