తెలుగు టీవీ ఫెడరేషన్ అధ్యక్ష్యుడికి కరోనా లక్షణాలు...వారం క్రితమే ప్రెస్ మీట్ !

తెలుగు టీవీ ఫెడరేషన్ అధ్యక్ష్యుడికి కరోనా లక్షణాలు...వారం క్రితమే ప్రెస్ మీట్ !

నిన్న తెలుగు టీవీ ఫెడరేషన్ అధ్యక్ష్యుడికి కరోనా లక్షణాలు బయటపడడం సంచలనం రేపుతోంది. తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కి కెమెరా మెన్ అయిన కూనపరెడ్డి శ్రీనివాస్ (పెద్ద) అనే ఆయనకు కరోనా లక్షణాలు బయటపడడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిజానికి కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హెల్త్ ఎమర్జెన్సీకి అనుకూలంగా టీవీ సీరియల్స్, గేమ్ షోస్, వెబ్ సిరీస్ షూటింగ్స్ నిలిపివేయాలని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు గత గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ప్రకటించింది. ఫెడరేషన్ అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాస్ (పెద్ద) అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకి కరోనా లక్షణాలు బయట పాడడంతో ఆ ప్రెస్ మీట్ కి హాజరు అయిన వారందరిలో టెన్షన్ నెలకొంది.