కండల వీరుడు కరోనా దెబ్బకు ఎలా అయిపోయాడో చూడండి...

కండల వీరుడు కరోనా దెబ్బకు ఎలా అయిపోయాడో చూడండి...

ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. అయితే, కరోనా సోకకముందు కరోనాను జయించిన తరువాత వారి శరీరాల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి ఆరువారాల చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఈ ఆరువారాల్లో కరోనా ఆయనను ఎంతలా కుంగదీసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. చికిత్స పొందుతున్న సమయంలో ఏకంగా 23 కిలోల బరువుతగ్గారు. చికిత్సకు ముందు కండలు తిరిగి ఉన్న అతని శరీరం బక్కపలుచగా తయారైందిఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ..'కరోనాకు ముందు నా బరువు 86 కిలోలుండేది. కరోనా తర్వాత నా బరువు 63 కిలోలకు పడిపోయింది. మీరు ఆరోగ్య వంతులైనప్పటికీ కూడా ఈ మహమ్మారి మిమ్మల్ని ప్రభావితం చేయగలదు. నేను వారానికి ఆరు నుంచి ఏడు సార్లు జిమ్‌లో కసరత్తు చేసేవాడిని. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న మయామి బీచ్‌లో మార్చిలో జరిగిన ఓ పార్టీకి హాజరయ్యాను. అందువల్లే నాకు కరోనా సోకింది. అంటూ వివరించాడు.