కరోనా దెబ్బకు పల్నాడు విలవిల...

కరోనా దెబ్బకు పల్నాడు విలవిల...

కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఇండియాలో రోజుకు 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  లాక్ డౌన్ విధించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, లాక్ డౌన్ నుంచి మెల్లిగా సడలింపులు ఇచ్చుకుంటూ వస్తున్నారు.  సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.  ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది.  ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు పెరిగిపోతున్నాయి.  గుంటూరు  నగరంలోనే  కాకుండా, పల్నాడుకు కేంద్రమైన నరసరావుపేటలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి.  

లాక్ డౌన్ కు ముందు గుంటూరు నుంచి వచ్చిన ఓ వ్యక్తి నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో టీ తాగాడు.  అక్కడి నుంచి కేసుల సంఖ్య పెరగడం మొదలైంది.  నరసరావుపేటలోని వరవకట్టాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.  దాదాపుగా 200 లకు పైగా కేసులు అక్కడ నమోదయ్యాయి.  మరోవైపు నరసరావుపేట తరువాత మాచర్లలో కేసులు పెరిగిపోవడం మొదలుపెట్టాయి.  మాచర్ల నుంచి  ఇప్పుడు వినుకొండకు కేసులు ఎటాక్ చేస్తున్నాయి.  పట్టణాల నుంచి గ్రామాలకు కరోనా కేసులు వ్యాపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు మొత్తం కరోనా భయంలో మునిగిపోయింది.  ఈ భయం ఎప్పటికి తగ్గుతుందో చూడాలి.