వివాదాలను వదిలి కరోనా + సమస్యలపై సమగ్ర చర్యలు 

వివాదాలను వదిలి కరోనా + సమస్యలపై సమగ్ర చర్యలు 

         
  తెలకపల్లి రవి 

    ఒకవైపు కరోనా మరోవైపు ఆర్థిక సంక్షోభంతో ప్రజానీకం, ఇంకో వైపుఅప్పు భారంలో రాష్ట్రం ఇలా  సమస్యులు వెంటాడుతున్నప్పటికీ ఎపిలో  ప్రభుత్వం  పక్షం, ప్రధాన  ప్రతిపక్షం వివాదాలే చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నిక కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి నియమించడమా లేదా అన్న దానిపై  కేసు ఉత్తర్వు పరంపరగా సాగుతున్నాయి. వికేంద్రీకరణ పేరిట విశాఖకు  కార్యనిర్వాహక రాజధానిని తరలించడంపై రెండవసారి శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ముందుండగా వాటి భవితవ్యంపై విపరీతమైన చర్చ నడుస్తున్నది. బిజెపి  నేతలు కూడా ద్వంద్వ భాషణతో గందరగోళం పెంచుతున్నారు. 


        అమరావతి రాజధాని ప్రాంత  ప్రజలతో రైతుతో ముఖాముఖి చర్చించి వారి సమస్యు పరిష్కరించడం, అక్కడ ఇప్పటికే చేసిన ఖర్చు, తీసుకున్న చర్యలు వృథా కాకుండా చూడటం కీలకం. ఎందుకంటే అది ఎవరి వ్యక్తిగత సొమ్ము కాదు. ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ ఆరోపణపై  దర్యాప్తు చేపట్టారు గనక  మామూలు రైతుతో స్తానికుతోనైనా చర్చించి సమస్యులు పరిష్కరించవచ్చు. వనరు కొరత కారణం అనుకుంటే కొంత పని జరిగిన చోటును వదిలిపెట్టి మరోచోట పూర్తిగా కొత్త నిర్మాణం చేసుకోవడానికి వనరు కొరత రాదా?  కనక ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమే. అమరావతిలో 1600 ఎకరాను బిల్డ్ ఎపి కింద అమ్మే ఆలోచన వున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు చెప్పడం మరింత వింత కప్పుతుంది.  ఇప్పటికే  అమరావతిపై పెట్టిన పదివే కోట్ల ఖర్చును రాబట్టుకోవడానికి ఈ అమ్మకమని చేసే వాదన  అసంబద్దం. శాసనసభను కొనసాగిస్తామని, మెట్రోపాలిటన్‌ నగరంగా పెంపొందిస్తామని అంటున్నవారు  పెట్టిన ఖర్చుకే భూము అమ్మేట్టయితే ఈ చెప్పే అభివృద్ది ఎలా చేస్తారు? రాజధానిపై చర్చ ఇలాటి వాస్తవిక కోణంలో గాక గత ప్రభుత్వ గొప్పు ఇప్పటి తప్పు మధ్య సమరంలా మార్చడం  వల్ల మొత్తం దారితప్పింది.


       ఎన్నిక కమిషనర్‌గా నిమ్మగడ్డ పునర్నియామకం సమస్యపై చాలా చర్చజరిగింది.ఎన్నిక వాయిదా సరైందైనా హైకోర్టు తీర్పునకు ముందు తర్వాత కూడా ఆయన అనుసరించిన పద్దతు కొన్ని రాజకీయ వివాదానికి దారితీశాయి.ఒక తీర్పువచ్చాక సుప్రీం కోర్టు కూడా మూడుసార్లు స్టే నిరాకరించాక ఇంకా సాగదీసుకుంటూ ప్రతిష్టంభనగా మార్చుకోవడం నిష్ప్రయోజనం. అదొక్కటే సమస్య అయినట్టు  టిడిపి వైసీపీలు దానిచుట్టూనే తిప్పుతున్నాయి. గిరిజనప్రాంతాలో నియామకాకులు  సంబంధించి న్యాయసమస్యపైగాని , రాష్ట్రానికి రావసిన నిధులు సాధనపై గాని చూపడం లేదు.మునిసిపల్‌ పంచాయితీ కార్మికులు , పారిశుద్యసిబ్బంది, అంగన్‌వాడీలు  ఆశావర్కర్లు, ప్రైవేటు స్కూుల్ టీచర్లు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికుల వంటివారిఉద్యమాలు పైనా స్పందన లేదు.

ప్రకాశం,విశాఖ,చిత్తూరు,తూర్పుగోదావరి తదితర చోట్ల దళితుపట్ల పోలీసు ప్రవర్తన, అత్యాచారాలు జరుగుతున్నా  అన్నీ  వివాదాలుగా చేయడం తప్ప విజ్ఞతచూపడం లేదు.అంతిమంగాఇవన్నీ సోషల్‌మీడియాలో వ్యక్తం చేశారనీ అరెస్టులు చేసేపరిస్థితి అవాంచనీయమైంది.అనేకసార్లు కోర్టు అక్షింతు వేస్తే వాటిపైనా వ్యతిరేకత పెంచుకోవడం తప్ప క్షేత్రస్థాయివాస్తవాను చూడటం లేదు. ఆఖరుకు కరోనా విజృంభణను నిరోధించడంలోనూ ఇదే జరుగుతున్నది. పరీక్షులు పెంచినా చికిత్సా సదుపాయాలు కొరత సమస్యగానే వుంది. ఇప్పుడు వెయ్యికోట్లు కేటాయించి ఖరీదైన మందు కొంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఖచ్చితమైనమందు ఏ మేరకు అందుబాటులో వున్నాయనేదే ప్రశ్నంగా వుంటే ఇది ఏ మేరకు ఆచరణసాధ్యమనేప్రశ్న అంతకన్నా ముఖ్యమైంది. తెలంగాణతో పోలిస్తే ఎపిలో పరీక్ష విషయంలో  మెరుగ్గా వున్నామని సంతృప్తి చెందుతున్నారే గాని మరణా సంఖ్య దాదాపు రెట్టింపు వుందని విస్మరించకూడదు. ఒకటి రెండు అంశాలోనే తమునకయ్యే పరిస్థితి మారి  అన్ని అంశాపై సమగ్రంగా దృష్టి సారిస్తారని ఆశిద్దాం.