తెలంగాణలో కరోనా హైఅలెర్ట్.. కారణం ఇదే...!

తెలంగాణలో కరోనా హైఅలెర్ట్.. కారణం ఇదే...!
ఓవైపు లాక్ డౌన్ సడలింపులు. మరోవైపు అంతకంతకూ పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం.. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేయనున్నారు వైద్య సిబ్బంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో ఏఎన్‌ఎంకు ... వంద ఇళ్లు కేటాయించారు. మూడు, నాలుగు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం వలసకూలీలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరో వైపు కరోనా వ్యాప్తి పై ఇవాళ్టి నుంచి భారత ఔషధ పరిశోధక మండలి (ICMR)సర్వే నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కలిగిన 60 జిల్లాల్లో ఈ సర్వే జరగనుంది. ఐసీఎంఆర్‌ సర్వే చేసే జిల్లాల్లో..తెలంగాణకు చెందిన జనగాం, నల్గొండ, కామారెడ్డిజిల్లాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రధానంగా సామాజిక స్థాయికి కరోనా వ్యాప్తి జరిగిందా? అనే కోణంలో ఈ సర్వే జరగనుంది.