వేలల్లో మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు

వేలల్లో మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు

ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఈసారి కన్వీనర్ కోటాలో వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా కన్వీనర్ కోటాలో 64,566 సీట్లు ఉండగా.. 36,163 మంది విద్యార్థులు మాత్రమే వెబ్‌ఆప్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 58,732 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వీరిలో ఓయూ రిజియన్ నుంచి 55,354 మంది.. ఆంధ్రా యూనివర్శిటీ రీజియన్ నుంచి 1807 మంది.. ఎస్వీ యూనివర్శిటీ పరిధి నుంచి 1157మంది.. ఇతరులు 414 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఎల్లుండి వరకు ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది... ఈ నెల 8న కన్వీనర్ కోటా సీట్లను కేటాయించనున్నారు.