జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు

జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు

వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని  జగన్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. తిరుమల తిరుపతి దేశస్థాన బోర్డుపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.  రహస్య తవ్వకాలతో పాటు శ్రీవారికి చెందిన పింక్‌ వజ్రం గురించి ఆయన  లేవనెత్తిన పలు అంశాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. రమణ దీక్షితులపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే టీటీడీ బోర్డు కూడా రమణ దీక్షితుల వైఖరిని ఖండిచడమే గాకుండా... న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్‌ను రమణ దీక్షితులు భేటీ కావడం సంచలనం రేపుతోంది.