రాజ్యాంగం గెలిచింది: జగన్

రాజ్యాంగం గెలిచింది: జగన్

కర్ణాటకలో రాజ్యాంగం గెలిచిందని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. యడ్యూరప్ప రాజీనామా తదనంతర పరిణామాలపై ఆయన స్పందించారు. కర్ణాటక ఎపిసోడ్‌లో కూడా చంద్రబాబును టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఏపీలో నాలుగేళ్లుగా ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు అనేకం జరిగాయన్నారు. కర్ణాటకలో బీజేపీపైన కేవలం ఆరోపణలే వచ్చాయని.. ఏపీలో నేరుగా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని జగన్‌ ఆరోపించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ బాబు అడ్డంగా దొరికారన్నారు. ఇన్ని చేసిన చంద్రబాబు.. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్న జగన్‌ అన్నారు. తప్పని తెలిసి, అల్లరి అవుతుందని కర్ణాటకలో బీజేపీ వెనక్కి తగ్గందని, ఏపీలో మాత్రం టీడీపీ నిస్సిగ్గుగా ముందుడుగు వేసిందని విమర్శించారు.