భార్యపై అనుమానంతో బయటగడి పెట్టాడు... తరువాత తెరిచి చూసే సరికి...!!

భార్యపై అనుమానంతో బయటగడి పెట్టాడు... తరువాత తెరిచి చూసే సరికి...!!

అనుమానం పెనుభూతం అంటారు.  అనుమానాస్పద ధోరణి కలిగిన వ్యక్తులు నిత్యం టెన్షన్ పడుతూనే ఉంటారు.  నెగెటివ్ మైండ్ తో ఆలోచిస్తుంటారు.   ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ అనుమానం అన్నది వదలకపోతే దాని వలన జీవితంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.  ఓ కానిస్టేబుల్ తన భార్యపైన విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు.  భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని ఉందని భావించేవాడు.  ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకున్నాడు. 

భార్య సదరు వ్యక్తితో కలిసి మరో ఇంట్లో ఉందనే అనుమానంతో ఆ ఇంటికి వెళ్లి, బయట గడిపెట్టాడు. అక్కడితో ఆగకుండా చుట్టుపక్కల వాళ్ళను, మీడియాను, పోలీసులను పిలిపించాడు.   భార్య బండారం బయటపెట్టేందుకు సిద్దమయ్యి, బయటగడి తెరిచాడు.  భార్య బయటకు వస్తుంది అనుకుంటే ఆమె అక్క బయటకు వచ్చింది.  మరిదిని నాలుగు తిట్లు తిట్టేసి వెళ్ళిపోయింది.   ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని మైలవరంలో జరిగింది.