వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు..

వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు..

పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఏమాత్రం   పట్టించుకోవటం లేదన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్ట్ కి వెళ్లిన తర్వాత.. అమలు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని.. కేసీఆర్ హామీల అమలుకు కృషి చేయటం మానేశారని ఆయన ఆరోపించారు. 'రేపు ప్రధానిని కలుస్తున్నారు కదా... పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు అమలు చేస్తుందో అడగండి గత ప్రభుత్వం చేస్తా అనడం.. ఇప్పుడు ప్రభుత్వం కాదనటం ఏంటి..?' అని కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు.  

తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేస్తోందని.. ప్రగతి భవన్ లో కూర్చొని ఇదే నా ప్రపంచం అనుకుంటున్నారు... కనీసం రాష్ట్ర హక్కులను కాపాడాలని కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ముస్లింలకి ఇచ్చిన హామీ మేరకు..12% రంజాన్ గిఫ్ట్ మోడీతో ఇప్పించండని ఆయన కోరారు. లేదంటే.. క్షమాపణ కోరాలని తెలిపారు. అప్పట్లో మోడీ మాకేమీ అవసరం లేదు.. ప్రేమ ఉంటే చాలు అన్నారు కేసీఆర్. సీఎం కోరినట్లే.. కేసీఆర్ ని మోడీ ప్రేమిస్తున్నారని షబ్బీర్ అలీ వెల్లడించారు.