అవినీతి చేసిన వారిని చెప్పుతో కొట్టాలి

అవినీతి చేసిన వారిని చెప్పుతో కొట్టాలి

అవినీతి చేసిన వారిని చెప్పుతో కొట్టాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సెంటర్ ఫర్ మీడియా స్టడీస్-సీఎంఎస్  నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణలో 73 శాతం అవినీతి ఉందని విమర్శించారు. ఈ సర్వేలో తెలంగాణ రెండవ స్థానం, ఏపీ నాలుగవ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి చేసిన వారిని చెప్పుతో కొట్టాలన్నారు.. అలా చేసి ఉంటే చెప్పులు కూడా సరిపోవు అని విమర్శించారు. 73 శాతం అవినీతిని కూడా దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకోవాలి అని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల కోసమే రైతుబంధు పథకంను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు అని తెలిపారు. రైతుబందు పథకంకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చయో సీబీఐ విచారణ జరపాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబ సభ్యులను ఇప్పటి వరకు ఎందుకు ఆదుకోలేదు అని ప్రశ్నించారు. అసలైన హిందువు కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చెప్పుతున్నారు.. ఎంఐఎంతో సంబంధం లేకుండా హిందువు అని చెప్పు కేటీఆర్ అని అన్నారు. అసలైన హిందు అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ తో అక్బర్, అసదుద్దీన్ ఉంటారా సమాధానం చెప్పాలన్నారు.