కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి : ఉత్తమ్

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి : ఉత్తమ్

రాష్ట్రంలో కరోనా తో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు. ఉస్మానియా హాస్పిటల్ లోకి నీళ్ళు రావటం అంటే సీఎం కేసీఆర్ సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ పని తీరుకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. చిన్న వానకే హాస్పిటల్ లోకి నీళ్ళు వచ్చాయంటే పాలకులు సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. ఇది తుగ్లక్ పాలన అనాలా ఇంకా ఏమన్నా అనాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం సెక్రటేరియట్ కూలగుడుతున్నాడని కామెంట్ చేసారు. రాష్ట్రంలో ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తాయని తక్కువ టెస్టు లు చేస్తున్నారని మండిపడ్డారు.అంతే కాకుండా ప్రభుత్వం మరణాల సంఖ్య కూడా తక్కువ చేసి చూపిస్తుందన్నారు. ప్రభుత్వ పని తీరుతో హైదరాబాద్ లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపైన జనాలకు నమ్మకం పోయిందని, ప్రైవేట్ హాస్పిటల్ పై ప్రభుత్వానికి నియంత్రణ లేదని అన్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చటం లేదో సీఎం కేసీఆర్ చెప్పాలని కోరారు. ఈటెల రాజేందర్ రబ్బర్ స్టాంప్ మంత్రి అంటూ ఎద్దేవా చేసారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో  ఏమి జరుగుతుందో అందరికీ తెలిసే విధంగా live dash board లను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అయినా ఉస్మానియా హాస్పిటల్ ను కాపాడుకోవాలని తెలిపారు. కరోనా పేషంట్ లకు చికిత్స చేస్తున్న డాక్టర్స్, నర్సులు , సిబ్బంది కి అందరికీ 50 శాతం జీతం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేసారు.