హైద‌రాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలి..!

హైద‌రాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలి..!

తెలంగాణ‌లో రోజురోజుకీ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి... ముఖ్యంగా హైద‌రాబాద్‌లో న‌మోద‌వుతోన్న కేసులు.. వ‌ణుకుపుట్టిస్తున్నాయి.. దీంతో.. హైద‌రాబాద్‌లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ విధించాల‌ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు అంజ‌న్ కుమార్ యాద‌వ్.. క‌రోనావైర‌స్‌తో హైదరాబాద్‌లో కోటి మందికి భ‌యం ప‌ట్టుకుంద‌న్న ఆయ‌న‌.. దిన‌స‌రి కూలీలు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, ఫీవర్ ఆస్ప‌త్రుల్లో ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంద‌న్న అంజ‌న్‌కుమార్.. వెంటిలేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని డిమాండ్ చేశారు. క‌రోనా వారియర్స్ కి కూడా రక్షణ లేదు.. అందుకే వారు కూడా కరోనాబారిన ప‌డుతున్నార‌ని.. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కేసీఆర్.. ప్రజలను మాటలతో మోసం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆరోగ్య‌శాఖ మంత్రి నామ‌మాత్రంగా ప‌నిచేస్తున్నార‌ని ఎద్దేవా చేసిన అంజ‌న్‌కుమార్.. ఇక‌, గత నాలుగు నెలలుగా విద్యుత్ బిల్లుల భారం ప్ర‌జ‌ల‌పై ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. త్వ‌ర‌లోనే బోనాల పండుగ వ‌స్తుంది.. లాక్ డౌన్ నిబంధన మేరకు అనుమతి ఇవ్వాల‌ని కోరారు.