కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వేరు కాదు: లక్ష్మణ్‌

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వేరు కాదు: లక్ష్మణ్‌

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వేరు కాదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అణగదొక్కేందుకు ఈ రెండు పార్టీలూ కుట్రపన్నుతున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఇవాళ గజ్వేల్‌లో బీజేపీ  యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇటు కేసీఆర్‌, అటు చంద్రబాబునాయుడు సహకరించారని అన్నారు.  కొత్త రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. ఆ తర్వత ఆ మాటే మరిచారని లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాలను చైతన్య యాత్ర ద్వారా కార్యకర్తలు ప్రజల్లో తీసుకెళ్లి వివరించాలని లక్ష్మణ్‌ సూచించారు.