కరోనా ఎఫెక్ట్ : కండోమ్స్, ఐపిల్స్ సేల్స్ పెరిగాయట ! 

కరోనా ఎఫెక్ట్ : కండోమ్స్, ఐపిల్స్ సేల్స్ పెరిగాయట ! 

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.. మొదట ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించగా. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో  దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించారు ప్రధాని మోడీ. ఇప్పటికే వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడగా కేవలం ఎమర్జన్సీ, నిత్యావసరాలు మాత్రమే దొరుకుతున్నాయి. అది కూడా కొన్ని ప్రత్యేక సమయాల్లోనే దొరుకుతున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ నేపధ్యంలో కొత్తగా పెళ్లి అయిన జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందట. ఇప్పటికే పెళ్ళయి రోజూ ఉద్యోగాలకి వెళ్ళే జంటలకు ఈ సమయం హనీమూన్ సమయంలా మారిందని అంటున్నారు. నిత్యావసరాలతో పాటు కండోమ్స్, ఐపిల్స్ సేల్స్ పెరిగినట్టు చెబుతున్నారు. ఏదేమైనా బయటకి రాకుండా ఉండడం అనేదే కాన్సెప్ట్ కాబట్టి అలా వారు సహకరిస్తే 21 రోజుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.