విజయవాడకు రండి.. స్వామికి బాబు ఆఫర్‌

విజయవాడకు రండి.. స్వామికి బాబు ఆఫర్‌

కర్ణాటకలో బీజేపీ ఆడుతున్న డ్రామాకు వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాలన్న కుమారస్వామి పిలుపునకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. వెనువెంటనే జేడీఎస్‌ అధ్యక్షుడు దేవెగౌడతో మాట్లాడారు. జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను విజయవాడకు రమ్మని ఆహ్వానించారు. సంఖ్యాబలం లేకండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి జేడీఎస్‌, కాంగ్రెస్‌లు తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలను వేరే రాష్ట్రాలకు తరలిస్తుననాయి.