కాఫీతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చా...!! 

కాఫీతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చా...!! 

కాఫీతో ఉదయం ప్రారంభం అనే యాడ్ అప్పుడెప్పుడో చూశాం. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం.  కాఫీ తాగే వాళ్లకు ఓ శుభవార్త.  రోజు రెండు కప్పుల కాఫీ తాగే వారు టైపు 2 డయాబెటిస్ బారిన పడే రిస్క్ తక్కువగా ఉంటుందని తాజా స్టడీస్ తెలియజేస్తున్నాయి.  రోజుకు ఒక కప్పు కాఫీ తాగే వారికంటే కూడా రోజుకు రెండు కప్పులు కాఫీ తాగే వారిలో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తక్కువగా ఉంటున్నట్టు ఇండియన్ అమెరికన్ రీసెర్చ్ స్టడీస్ తెలియజేసింది.  

ఇక ఒక కప్పు లేదా కాఫీ తాగే అలవాటు లేని వాళ్లలో టైపు 2 డయాబెటిస్ రిక్స్ ఎక్కువగా ఉన్నట్టు వీరి రీసెర్చ్ లో తేలింది.  కాఫీలో కెఫీన్ అనే పదార్ధం ఉంటుంది.  ఇది డయాబెటిస్ పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు.  తక్కువ మోతాదులో కాఫీని తీసుకున్నా, లేదంటే ఎక్కువ మోతాదులో కాఫీని  పుచ్చుకున్న ఇబ్బందే.  అయితే, రెండు కప్పుల కాఫీ తీసుకుంటే ఆరోగ్యం బాగుందని నిపుణులు చెప్తున్నారు.  డయాబెటిస్ అదుపులో ఉంచుకోగలిగితే శరీరంలోని చాలా అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు.