త్వరలో కోకా కోలా కొత్త బీర్‌..!

త్వరలో కోకా కోలా కొత్త బీర్‌..!

కోకా కోలా కంపెనీ తొలిసారిగా అల్కాహాలిక్ డ్రింక్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. జపాన్‌లో స్థానికంగా లభించే ‘షోచు’ అనే స్పిరిట్‌తో తయారు చేసే చు-హి అనే క్యాన్డ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. దీంతో కోకా కోలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ డ్రింక్‌లో 3 నుంచి 8 శాతం అల్కాహాల్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటిని అల్కోపాప్ అని కూడా పిలుస్తారు. అల్కోపాప్ డ్రింకులను సులభంగా తాగే అవకాశం ఉండటం వల్ల యువత దాని వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుంది. అయితే ఇటువంటి డ్రింక్ లపై జపాన్‌ లో వ్యతిరేకత వ్యక్తమౌతుంది.

కాగా కోకా కోలా జపాన్ అధ్యక్షుడు జోర్జ్ గార్డునో మాట్లాడుతూ .. ‘గతంలో అల్కాహాల్ కు సంబంధించి మేము ఎన్నడూ కూడా ఇలాంటి ప్రయోగం చేయలేదు. అయితే కొత్త ప్రాంతాల్లో అవకాశాలు రావడానికి ఇదో ఉత్తమ మార్గం’ అని వివరించారు. జపాన్‌లో ఇలాంటి డ్రింకులకు మంచి డిమాండ్ ఉంది. బీరులకు ప్రత్యామ్నాయంగా ఈ డ్రింకులను విక్రయిస్తున్నారు. జపాన్ మహిళలు ఈ బీరుపై ఎక్కువ ఆసక్తి చూపడం విశేషం.