కోకాకోలా నుంచి ఆల్కాహాలిక్ డ్రింక్

కోకాకోలా నుంచి ఆల్కాహాలిక్ డ్రింక్

ప్రపంచంలోనే అతిపెద్ద శీతలపానీయాల తయారీ సంస్థ కోకా-కోలా జపాన్‌లో ఆల్కాహాలిక్‌ డ్రింక్‌ను విడుదల చేసింది. 3 నుంచి 8 శాతం ఆల్కాహాల్‌తో ఈ కొత్త డ్రింక్ ను ప్రయోగాత్మకంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. లోకల్ మేడ్‌ స్పిరిట్ 'షోచూ'ను ఉపయోగించి 'చూహీ' అనే స్థానిక డ్రింక్ తరహాలో 3 ఫ్లేవర్లను విక్రయానికి ఉంచింది. టిన్నులలో ఉండే బీర్ల కోసం జపాన్‌ యువత ఎగబడుతోందట. అందుకే యువతను ఆకర్షించేందుకు టిన్‌ ప్యాకింగ్‌లో ఈ డ్రింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. 40 ఏళ్ల క్రితం కోకాకోలా..  వైన్‌ను విక్రయించినా 1983లో దాన్ని వదిలివేసింది.