లైవ్‌: గ్యాస్‌ లీక్‌ బాధితులకు పరిహారం పంపిణీ

లైవ్‌: గ్యాస్‌ లీక్‌ బాధితులకు పరిహారం పంపిణీ

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ప్రమాదంతో 12 మంది మృతిచెందారు.. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.. మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోయి.. చెట్టూ,చేమ మాడిపోయాయి.. ఐదు ఊళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది..  అయితే, వెంటనే స్పందించిన ప్రభుత్వం.. గ్యాస్‌ను అదుపు చేసింది.. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంది.. అంతే కాదు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ పరిహారాన్ని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున.. వెంటిలేటర్‌పై చికిత్స పొందినవారికి రూ.లక్షల చొప్పున.. అంతేకాకుండా.. ఆ ఐదు గ్రామాల్లో.. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే.. అందిరికీ చిన్నాపెద్ద తేడా లేకుండా రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.. దీనికి సంబంధించిన పరిహారం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. దీనిపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంపై మాట్లాడుతున్నారు.. ఇప్పుడు లైవ్‌లో చేసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..