ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ...!

 ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ...!

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ కోరారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని లేఖలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకించారు సీఎం కేసీఆర్. ఈ బిల్లు పాస్ అవకుండా పార్లమెంట్‌లో పోరాడుతామని ప్రకటించారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలిపేందుకు జూన్ 5 వరకూ కేంద్రం గడువు విధించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు.