మనమే కింగ్ మేకర్...

మనమే కింగ్ మేకర్...

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే కింగ్ మేకర్ అన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... హైదరాబాద్‌లో జరిగిన టి.టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ... కర్ణాటకలో ఏమి జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుందని... తెలుగుదేశం పార్టీని కాదని ఎవరూ ఏమి చేయలేరని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో పెను మార్పులు వస్తాయని వెల్లడించారు చంద్రబాబు... దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తనకు ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదని మరోసారి స్పష్టం చేసిన ఏపీ సీఎం... 20 ఏళ్ల క్రితమే వద్దనుకున్నానని... తెలుగువారికి సేవ చేయడమే తన లక్ష్యంమన్నారాయన. 

నాలుగేళ్లలో తెలంగాణలో కార్యకర్తలు ఎదిగారు... భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అన్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో మనల్ని కాదని ఎవరూ ఏమీ చేయలేరన్న టీడీపీ అధినేత... తిరుగులేని శక్తిగా టీడీపీ తెలంగాణలో తయారవుతోందన్నారు. హైదరాబాద్ మహానగరంగా తయారు కావడం వెనుక ఎంతో కృషి చేశామన్నారు చంద్రబాబు... ఔటర్ రింగ్ రోడ్ కి శ్రీకారం చుట్టింది టీడీపీయేనని గుర్తు చేసిన ఆయన.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తమ ఘనతే అన్నారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చి... విద్యకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వెల్లడించిన ఏపీ సీఎం... సైబరాబాద్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశానిదే అన్నారు. హైదరాబాద్, తెలంగాణపై టీడీపీది చెరగని ముద్ర అన్నారు. ఆంధ్ర, తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉండాలనేది టీడీపీ సంకల్పం... ఎన్నికల్లో బెబ్బులి పులిల పని చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు... టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని... నమ్మక ద్రోహం చేసిందంటూ బీజేపీపై మండిపడ్డ టీడీపీ అధినేత... తెలంగాణలో ఏక పక్షంగా పొత్తులేదని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఆంధ్రకు, తెలంగాణకి కేంద్రం ఒరగబెట్టిందేమీలేదని... పటేల్, శివాజీ విగ్రహాలకి డబ్బులు ఇస్తారు కానీ, ఎందుకు హైదరాబాద్ కి ,ఆంధ్రప్రదేశ్, అమరావతికి ఇవ్వరని కేంద్రాన్ని నిలదీశారు.