కాంగ్రెస్‌లో రేవంత్ రగడ...

కాంగ్రెస్‌లో రేవంత్ రగడ...

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి రగడ సృష్టించినట్లయ్యింది... మీడియాతో మాట్లాడిన రేవంత్ రాహుల్ దూతలు చాలా హామీలు ఇచ్చారని... అందుకే కాంగ్రెస్‌లో చేరానని... అంతే కాదు ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా ముఖ్యమంత్రినవుతానని వ్యాఖ్యానించడం చర్చగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మళ్లీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదుల పర్వానికి తెరలేపినట్టు అయ్యింది. రేవంత్‌రెడ్డిపై కుంతియాకు సీనియర్లు ఫిర్యాదు చేస్తున్నారు. కుంతియాను కలిసిన సీఎల్పీ నేత జానారెడ్డి... రేవంత్ అలా అనకుండా ఉండాల్సిందంటూ కుంతియా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే రేవంత్ 'సీఎంకు అర్హుడే' అని గతంలో మీరు వ్యాఖ్యానించలేదా? అని జానారెడ్డిని కుంతియా ప్రశ్నించారు... దీనికి ఆయన బదులిస్తూ నేను ఆ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.