అసదుద్దీన్ ఒవైసీకి కరోనా పాజిటివ్ ప్రచారం...క్లారిటీ ఇచ్చిన ఒవైసీ

అసదుద్దీన్ ఒవైసీకి కరోనా పాజిటివ్ ప్రచారం...క్లారిటీ ఇచ్చిన ఒవైసీ

తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరీముఖ్యంగా హైదరాబాద్ లో ఈ కరోనా కేసులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకి కరోనా సోకగా, నిన్న హోం మినిస్టర్ కి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కూడా కరోనా సోకింది. అయితే అదే సమయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయింది. కానీ అదేమీ నిజం కాదని ఆయన కొట్టిపారేశారు. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ సృష్టి అన్న ఆయన, ఇది ఎవరో కావాలని సృష్టించిందని అన్నారు.  

ఇక హైదరాబాద్‌లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, టెస్టులు చేయకుండా కరోనా మీద పోరాటం చేయలేమని ఏఐఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిన్న ఆయన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి రాజేందర్‌ కు లేఖ రాశారు.  హైదరాబాద్‌ పరిధిలో సుమారు 20 వేల టెస్టులైనా చేయాలని, ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే 2వేల కరోనా టెస్టులు చేయాలని ఒవైసీ కోరారు. చార్మినార్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయన్న ఆయన వీలైనంత త్వరగా కరోనా టెస్టుల సంఖ్యను పెంచితే వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.