రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సివిల్ పంచాయితీలు?

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సివిల్ పంచాయితీలు?

కరోనా కాలంలో మీడియా సమావేశాలు పెట్టడం సాధ్యం కావడం లేదు. అందువల్లే లేఖలు రాస్తున్నారని అనుకున్నా.. కొన్ని సందర్భాలలో కీలక అంశాలతో విడుదల చేసిన లెటర్లు సైతం మరుగున పడుతున్నాయి. ఈ విషయం  ఆయా పార్టీల అధినేతలకు తెలిసినా.. ఈ సమయంలో మా దగ్గర మరో ఆప్షన్‌ లేదనే కామెంట్స్‌ చేస్తున్నారట. మరి.. లేఖలతో సమాధానాలు రాబడతారో.. ఉత్తరకుమారులుగా మిగిలిపోతారో చూడాలి. 

సివిల్‌ పంచాయితీలకు అలవాటు పడిన పోలీసులు ఓ పట్టాన వాటిని వదులుకోలేరు. పైవాళ్లు హెచ్చరించినా.. చర్యలు తీసుకున్నా.. అందులో వచ్చే లాభం మరెందులోనూ రాదని అంటారు. ఆ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ అదే జరుగుతోంది. బాస్‌ కన్నెర్ర చేసినా కిందిస్థాయి అధికారులకు లెక్కే లేకుండా పోయిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

భువనగిరి జోన్‌లో పోలీసుల సివిల్‌ పంచాయితీలు!

హైదరాబాద్‌, సైబరాబాద్‌ తర్వాత కీలకమైన పోలీస్‌ కమిషనరేట్‌ రాచకొండ. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని కొంత పరిధిని విడగొట్టి రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేశారు. ఇందులో కీలకమైనది భువనగిరి జోన్‌. యాదగిరిగుట్ట ఈ జోన్‌ పరిధిలోకే వస్తుంది. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ ఓ రేంజ్‌లో సాగుతోంది. దీంతో సివిల్‌ తగాదాలు ఎక్కువయ్యాయి. పోలీసులే వీటిని పంచాయితీలు పెట్టి తీర్చేస్తున్నారు. వీటిల్లో ఇన్వాల్వ్‌ అయిన CI, SI స్థాయి అధికారులపై తరచూ చర్యలు తీసుకుంటున్నా సిబ్బందిలో మార్పురావడం లేదని టాక్‌. 

సీపీ వేటు వేసినా లెక్క చేయడం లేదా?

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా మహేష్‌ భగవత్‌ ఉన్నారు. సివిల్‌ పంచాయితీల గురించి ఏ మాత్రం తెలిసినా అస్సలు ఊరుకోవడం లేదు. కానీ... అవినీతికి అలవాటుపడ్డ సిబ్బంది కొత్తదారులు వెతుక్కుంటున్నారట. సీపీ వేటు వేసినా లెక్క చేయడం లేదని సమాచారం. ఇటీవల వెలుగు చూసిన ఘటనలే దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.

సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేసినా వారంలో మళ్లీ సీఐగా రాక!

పేలుడు పదార్ధాల తరలింపు.. ఫామ్‌ హౌజ్‌లో పేకాటలను చూసి చూడనట్లు వదిలేయడం, రియల్‌ ఎస్టేట్‌ పంచాయితీల ఆరోపణలపై అప్పట్లో CP ఆఫీసుకు భువనగిరి రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డిని అటాచ్‌ చేశారు. అయితే.. తనకు తెలిసిన ప్రజా ప్రతినిధుల ద్వారా నరుక్కొచ్చారో ఏమో కానీ.. వారంలోని మళ్లీ అదే స్థానంలో సీఐగా రావడంతో అంతా ఆశ్చర్యపోయారట. 

పోలీస్‌ క్వార్టర్స్‌లోనే ల్యాండ్‌ సెటిల్‌మెంట్స్‌!

బొమ్మలరామారానికి చెందిన కానిస్టేబుల్‌ సుధాకర్‌ను ఏకంగా సర్వీస్‌  నుంచే తొలగించారు. కానీ .. అతను పోలీస్ క్వార్టర్స్‌ను వీడలేదు. అక్కడే దర్జాగా ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. యాదగిరిగుట్ట CI పాండురంగారెడ్డిని సైతం వివిధ ఆరోపణలపై CP ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. వారం క్రితం ఉత్తర్వులు వచ్చినా ఆయన సీపీ ఆఫీస్‌కు వెళ్లకుండా పోలీస్‌ వాహనంలో యాదగిరిగుట్టలోనే రౌండ్స్‌ వేశారు. నేతల సాయంతో మళ్లీ ఇక్కడ పోస్టింగ్‌ కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. 

భూ వివాదంలో రాజీ అయిన వారికి సీఐ, ఎస్‌ఐ బెదిరింపులు?

అలాగే ఓ భూ వివాదంలో సంబంధీకులు రాజీ అయ్యారు. లోక్‌ అదాలత్‌కు వెళ్లగా.. అక్కడ రామన్నపేట CI , మోత్కూరు SI బెదిరించారట. దీనిపై బాధితులు తమకు పరిచయం ఉన్న IPS అధికారికి మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఆయన CPకి చెప్పడంతో CI, SIలను కమిషనరేట్‌కు అటాచ్‌ చేసినట్లు చెబుతున్నారు. అలాగే గుప్త నిధుల కేసులో తురకపల్లి SIని ఆర్నెళ్ల క్రితం CP ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. 

భూ మాఫియా, నేతలకు అండగా ఉంటున్నారా?

ఇలాంటి ఘటనలు అన్నీ భువనగిరి జోన్‌లోనే చోటు చేసుకుంటున్నాయి. మాఫియా, రాజకీయ నేతలు మిలాఖత్‌ అయ్యారని చెబుతున్నారు. వీరికి పోలీస్‌ శాఖలో కిందిస్థాయి సిబ్బంది అండగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ముఖ్యంగా భువనగిరి జోన్‌ పరిధిలో ప్రజా ప్రతినిధులు.. వారి మనుషులుగా చెలామణి అయ్యే CI, SIలు CP ఆదేశాలను సైతం పట్టించుకోకుండా సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. మరి.. ఈ పోకడలకు ఫుల్‌స్టాప్‌ పడేది ఎప్పుడో ఆ యదగిరీశుడికే తెలియాలి.