దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు 

దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు 

డిసెంబర్ 25 అంటే అందరికి గుర్తుకు వచ్చేది క్రిస్మస్.  కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.  క్రీస్తు జన్మదినం రోజును క్రిస్మస్ గా జరుపుకుంటారు.  అర్ధరాత్రి నుంచి ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి.  క్రైస్తవులు చర్చీలకు వెళ్లి అర్ధరాత్రి నుంచి ప్రార్ధనలు చేస్తారు.  శుభాకాంక్షలు చెప్పుకుంటారు.  

క్రీస్తు ప్రపంచానికి ఇచ్చిన సందేశం గురించి, ప్రపంచం కోసం ఆయన తన చేసిన మంచి పనుల గురించి తలచుకుంటారు.  ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.  ఈ వేడుకల కోసం దేశంలోని చర్చలు అందంగా ముస్తాబయ్యాయి.  ప్రపంచంలో అత్యధిక మంది జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ ఒకరి కావడం విశేషం.  ఈ పండుగ రోజున క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాస్ ప్రతిచోటా దర్శనం ఇస్తుంటాయి.  ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.