ప్రీమియర్ లీగ్ నుండి తప్పుకున్న యూనివర్సల్ బాస్...

ప్రీమియర్ లీగ్ నుండి తప్పుకున్న యూనివర్సల్ బాస్...

బిగ్-హిట్టింగ్ వెస్టిండీస్ ఓపెనర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఈ ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సిపీఎల్) నుండి తప్పుకున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన సిపీఎల్ యొక్క 2020 ఎడిషన్ ను ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 10 వరకు నిర్వహించవచ్చని అక్కడి ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా గేల్ జమైకాలో చిక్కుకుపోవడంతో తన కుటుంబాన్ని మిస్ అవుతున్నానని చెప్పాడు. అయితే లాక్ డౌన్ సడలింపుల తర్వాత కుటుంబంతో గడపడానికి తనకు విరామం అవసరమని చెప్పి అందుకే ఈ ఏడాది సిపీఎల్ ఆడటం లేదని తెలిపాడు . 40 ఏళ్ల గేల్ ను సెయింట్ లూసియా జూక్స్ జట్టు గతంలో జరిగిన వేలంలో సొంతం చేసుకుంది. అయితే వెస్టిండీస్ తరపున ఇప్పటివరకు గేల్ 103 టెస్టులు, 301 వన్డేలు ఆడాడు.