భారత టెస్ట్ వైస్ కెప్టెన్ వన్డేలోకి కూడా పనికాస్తాడు... 

భారత టెస్ట్ వైస్ కెప్టెన్ వన్డేలోకి కూడా పనికాస్తాడు... 

భారత మాజీ ఆటగాడు ప్రస్తుత వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ప్రస్తుత భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానెను వన్డే ఫార్మాట్ నుంచి తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 2018 నుండి అజింక్య వన్డే మ్యాచ్ ఆడలేదు. అయితే  50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ 4 వ స్థానంలో ఆడిన రహానే తర్వాత తన ప్రదర్శన కారణాంగా బాగా పడిపోయాడు. వాస్తవానికి, వన్డే ఫార్మాట్‌లో 4 వ స్థానంలో ఆడే ఈ ముంబై ఆటగాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా కూడా రాణించాడు. ఓపెనర్ గా రహానే 25 మ్యాచ్లలో, 36.65 సగటుతో 843 పరుగులు చేశాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ...  ''4 వ స్థానంలో రహానే సగటు బాగుంది. 4 వ స్థానంలో, మంచి ప్రదర్శనలు ఇస్తూ, నిలకడగా బాగా ఆడుతున్న సమయం లో మీరు అతనికి ఎందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదు?" అని భారత  సెలెక్టర్లను ప్రశ్నించారు. రహానేను వన్డే జట్టు నుంచి తప్పించాలనే నిర్ణయం అన్యాయమని చెప్పాడు. ఆకాష్ చోప్రా తన చివరి వన్డే సిరీస్‌లో అజింక్య రహానె ఆడిన ఆటతీరును గుర్తుచేసుకున్నాడు మరియు ఈ ఆటగాడిని తిరిగి జట్టులోకి  తీసుకోవాలని తెలిపాడు. ఇప్పటివరకు మొత్తం 90 వన్డే మ్యాచ్ లు ఆడిన రహానే 2962 పరుగులు చేసాడు.