కొరటాల శివ చిత్రంలో చిరు పాత్ర..!!

కొరటాల శివ చిత్రంలో చిరు పాత్ర..!!

చిరు సైరా సినిమా బిజీలో ఉన్నాడు.  ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  చిరు పోరాటాలకు సంబంధించిన సీన్స్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30% మేరకు పూర్తయింది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

చిరు సైరా సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.  సైరా తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలౌతుందని అనుకున్నారు.  కానీ, సైరా సినిమా నిర్మాణం పూర్తయ్యే సరికి సమయం పడుతుంది.  అందుకే సైరాతో పాటుగా కొరటాల శివ సినిమా కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, చిరంజీవితో కొరటాల శివ చేస్తున్న సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారని, ఎన్నారై పాత్ర ఒకటి కాగా, రెండోది రైతు పాత్రని అంటున్నారు.  ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలి.  కొరటాల శివ సినిమాల్లో సామాజిక అంశాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది.  సున్నితమైన సామాజిక అంశాన్ని బలంగా కమర్షియల్ ఫార్మాట్లో చెప్పడం కొరటాల శివ ప్రత్యేకత.  మిర్చి దగ్గరి నుంచి మొన్న వచ్చిన భరత్ అనే నేను వరకు అలాంటి సినిమాలే కావడం విశేషం.