చైనా కొత్త మెలిక ... అక్కడి నుంచి వైదొలిగేందుకు నిరాకరణ...  

చైనా కొత్త మెలిక ... అక్కడి నుంచి వైదొలిగేందుకు నిరాకరణ...  

ఇండియా చైనా మధ్య గాల్వాన్ లోయ ఘటన తరువాత ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.  అయితే, రెండు దేశాల మధ్య అనేక దఫాలుగా చర్చలు జరగడంతో గాల్వాన్ ప్రాంతం నుంచి   చైనా వెనక్కి తగ్గింది.  ఇటు ఇండియా కూడా కొంత మేర వెనక్కి తగ్గింది. అయితే, ఇండియా ఈ ప్రాంతంలో నిఘాను పెంచింది.  ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.  

ఇక ఇదిలా ఉంటె, పాంగాంగ్ త్సో లోని ఫింగర్ 4 నుంచి వెనక్కి తగ్గేందుకు చైనా నిరాకరించింది.  అక్కడి నుంచి వెనక్కి వెళ్లాలని ఇండియా పట్టుబడుతున్నది.  కానీ, చైనా అందుకు అంగీకరించడం లేదు.  దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఇండియా, చైనా బోర్డర్ లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించేందుకు చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్ లెఫ్ట్ నెంట్ జనరల్ వైకె జోషి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.  ప్రధాని మోడీని కలిసి పరిస్థితిని వివరించబోతున్నారు.  మరోవైపు రక్షణశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు, ఎల్లుండి లడఖ్, జమ్మూ కాశ్మీర్ లో పర్యటించబోతున్నారు.  వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్న సమయంలో  ఇండియా తూర్పు లడఖ్ లో 60వేలమంది  సైనిక బలగాలను మోహరించింది.