భారత వెబ్ సైట్లను బ్లాక్ చేస్తున్న చైనా.!

భారత వెబ్ సైట్లను బ్లాక్ చేస్తున్న చైనా.!

భారత్-చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్ టిక్ టాక్ తో సహా 59 చైనా ఆప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసందే. కాగా చైనా కూడా ఇప్పటికే భారత వెబ్ సైట్ లను సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియాకు చెందిన వెబ్ సైట్ లు చైనాలో కనిపించకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది.మరోవైపు భారత టీవీ చానళ్లు చూడాలన్నా ఐపీ టీవీ ఒక్కటే మార్గమని బీజింగ్ లోని భారత దౌత్య వర్గాల సమాచారం. చైనా ఆ దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ అంశం కూడా ప్రచారం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకుంది. తనకు అభ్యంతరకరం అని భావించిన వెబ్ సైట్లను, టీవీ చానళ్లను ఇంటర్నెట్లో చూసేందుకు వీల్లేకుండా వీపీఎన్ ను నిలువరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుంది.