గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌ నుండి మాయమయిన 59 యాప్ లు !

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌ నుండి మాయమయిన 59 యాప్ లు !

చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేష‌న్ల‌పై నిషేధం విధించాల‌ని లేదా ప్ర‌జ‌లు వాటిని వాడ‌కుండా చూడాల‌ని నిఘా వర్గాలు బుధ‌వారం కేంద్రానికి సిఫార‌సు చేసిన సంగతి తెలిసిందే. వీటి వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు ఉంద‌ని హెచ్చ‌రికలు జారీ చేయడంతో నిఘావర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ వాటిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌లను ఉప‌యోగించ‌డం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని నిఘా విభాగం అధికారులు వెల్లడించారు.

టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్, జెండ‌ర్, షేర్ఇట్, క్లీన్ మాస్ట‌ర్ స‌హా 59 ఇత‌ర మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా డేటా త‌స్కర‌ణ‌కు గుర‌వుతుంద‌ని నివేదిక‌లు అందడంతో వారిని నిన్న నిషేధించారు. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అధికారులు గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు నిన్ననే ఉత్తర్వులను పంపారు.దీంతో భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి ఆ 59 యాప్ లను ఆయా స్టోర్స్ నుండి తొలగించారు. నిన్న రాత్రి వరకు అవి స్టోర్స్ లో కనపడగా, నేటి ఉదయం నుంచి మాయం అయ్యాయి. భారత దేశ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు వంటి వాటికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌ 69ఏ కింద ఈ యాప్స్‌ను నిషేధించారు.