సంజయ్‌సాయి వర్దన్ మృతిపై హెచ్‌ఆర్‌సీలో బాలల హక్కుల సంఘం పిటిషన్

సంజయ్‌సాయి వర్దన్ మృతిపై హెచ్‌ఆర్‌సీలో బాలల హక్కుల సంఘం పిటిషన్

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో విషాదం ఘనటపై బాలలహక్కుల
సంఘం సీరియస్‌గా తీసుకుంది...బోరు బావిలోపడిన బాలుడు(సంజయ్‌సాయి వర్దన్‌) మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది..బాలుడు మృతి చెందిన ఘటనపై బాలల హక్కుల సంఘం హెచ్‌ఆర్‌సీలో పిటిషన్ వేసింది.. ఈ ఘటనకు రెవెన్యూ శాఖ అధికారులను బాధ్యులను చేయాలని బాలల హక్కుల సంఘం పిటిషన్‌లో కోరింది. బాలుడి కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది... అధికారుల అవినీత వల్లనే సంజయ్‌ సాయి మృతి చెందాడని, కేవలం డబ్బు కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ బోర్లకు అనుమతులిచ్చి ఆ బోరు విఫలమైతే దానిని వెంటనే  మూసి వేయడానికి చర్యలు చేపట్టడం లేదని పేర్కొంది.

అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని బాలల హక్కుల సంఘం పిటిషన్‌లో తెలిపింది. మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది...మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. పదిలక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం పిటిషన్‌లో పేర్కొంది...