టాస్‌ గెలిచిన చెన్నై.. రైజర్స్‌దే బ్యాటింగ్‌ 

టాస్‌ గెలిచిన చెన్నై.. రైజర్స్‌దే బ్యాటింగ్‌ 

ఐపీఎల్‌-11 ఫైనల్స్‌కు సర్వం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతన్న తుది పోరులో టాస్‌ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. హర్భజన్‌సింగ్‌ స్థానంలో స్పిన్నర్‌ కర్ణశర్మకు చెన్నై తుది జట్టులో స్థానం లభించింది. హైదరాబాద్‌ జట్టులో గాయపడిన కీపర్‌ సాహా స్థానంలో గోస్వామికి అవకాశం లభించింది. బౌలర్‌ ఖలీల్‌ ప్లేస్‌లో సందీప్‌శర్మను ఎంపిక చేసింది.