ఛేజింగ్‌లో చెన్నై రికార్డు ఇదీ..

ఛేజింగ్‌లో చెన్నై రికార్డు ఇదీ..

ఐపీఎల్‌ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 179 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న చెన్నై జట్టు సునాయాశంగా ఈ స్కోరును సాధిస్తుందన్నది సగటు అభిమాని అంచనా. కానీ.. లెక్కలు చూస్తే పరిస్థతి మరోలా ఉంది. ఐపీఎల్‌లో చెన్నై జట్టును ఛేజింగ్‌ గండం వెంటాడుతోంది. ఇప్పటి వరకు 7సార్లు ఫైనల్‌కు చేరిన చెన్నై జట్టు.. కేవలం రెండుసార్లే టైటిల్‌ నెగింది.  2010లో ముంబై ఇండియన్స్‌, 2011లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరులతో జరిగిన ఫైనల్లో గెలిచి చెన్నై వరుసగా ట్రోఫీలందుకుంది. కోల్‌కతాతో జరిగిన 2012 ఫైనల్లో ఛేజింగ్‌ చేయలేక చతికిలబడింది.  2015 సీజన్‌ ఫైనల్లో సైతం ఫీల్డింగ్‌ ఎంచుకుని ఓడిపోయింది. దీంతో ఛేజింగ్‌ అనేది చెన్నై జట్టుకు బ్యాడ్‌ సెంటిమెంట్‌గా మారింది. మరి ఈసారి గత చరిత్రను తిరగ రాసి ట్రోఫీని చేజెక్కించుకుంటుందా? లేకు ఛేజింగ్‌ గండంలో చిక్కుకుంటుందా? అన్నది తెలియాలంటే మరొకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..