జట్టుని ప్లే ఆఫ్ ‌కి చేర్చిన ధోని

జట్టుని ప్లే ఆఫ్ ‌కి చేర్చిన ధోని

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య పుణేలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్లేఆఫ్‌కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం బెంగళూరు బాగా చెమటోడ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన చెన్నై ఆరంభంలోనే వెంటనే వెంటనే వికెట్లు కోల్పోయింది. తక్కువ పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోనీ బ్రావోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.. నెమ్మదిగా స్కోరు వేగాన్ని పెంచుతూ.. ఆ తర్వాత విరుచుకుపడ్డాడు. 23 బంతుల్లో 3 సిక్సులు, ఒక ఫోర్‌తో 31 పరుగులు చేసిన ధోనీ జట్టును ప్లేఆఫ్‌కి చేర్చాడు. చెన్నై 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అనవసర తప్పిదాలు, ఫీల్డింగ్ వైఫల్యాలు బెంగళూరు ఓటమికి కారణాలయ్యాయి.