రాజస్థాన్ లక్ష్యం 177...

రాజస్థాన్ లక్ష్యం 177...

ఐపీఎల్‌-11లో భాగంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌, చెన‍్నై సూపర్‌ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో  చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్ మొదటిలో ధాటిగా ఆడినా.. చివర్లో దూకుడుగా ఆడలేకపోవడంతో తక్కువ పరుగులకే పరిమితం అయ్యింది. టాస్‌ గెలిచి మొదటగా బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై.. త్వరగానే అంబటి రాయడు(12) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌కు జత కలిసిన సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వాట్సన్‌(39; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)పెవిలియన్ అనంతరం.. రైనాకు తోడుగా ధోని జత కలిశాడు. రైనా(52;35  బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)హాఫ్ సెంచరీ అనంతరం అవుట్ అయ్యాడు. ధోని(33 నాటౌట్‌; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌), సామ్‌ బిల్లింగ్స్‌(27;‌ 22 బంతుల్లో 3 ఫోర్లు)లు ఆదుకోవడంతో.. 176 పరుగుల సాధారణ స్కోర్ చేసింది చెన్నై. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీసాడు.