టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్-11లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై ఈ మ్యాచ్ ను గెలిచి ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ కు తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఇరుజట్లు రెండు చేంజెస్ తో బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ  మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కొత్త జెర్సీలో బరిలోకి దిగుతుంది. ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రాజస్థాన్ జట్టు పింక్ జెర్సీలో మైదానంలోకి అడుగెడుతుంది.

జట్లు:

రాజస్థాన్: అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ప్రశాంత్ చోప్రా, సంజు శాంసన్, బెన్‌స్టోక్స్, స్టువార్ట్ బిన్నీ, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, అంకిత్ శర్మ, జయ్‌దేవ్ ఉనద్కత్, ఇష్ సోధీ.

చెన్నై: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, శామ్ బిల్లింగ్స్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), డ్వాన్ బ్రావో, రవీంద్ర జడేజా, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, హర్భజన్ సింగ్, శార్దూల్ ఠాకూర్