ప్రఖ్యాత చెఫ్ ఆంటోనీ బౌర్డేన్ ఆత్మహత్య 

ప్రఖ్యాత చెఫ్ ఆంటోనీ బౌర్డేన్ ఆత్మహత్య 

ఆంటోనీ బౌర్డేన్ ... ప్రపంచం మెచ్చిన చెఫ్. ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ ఆధునిక నలభీముడు ఆత్మహత్య చేసుకున్నారు. సీఎన్ఎల్ నెట్ వర్క్ లో వంటల కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. అరుదైన, మంచి ఆహారాన్ని 30 సంవత్సరాలుగా ప్రజలకు పరిచయం చేస్తున్నారు. టీవీల్లో వంటల ప్రోగ్రామ్స్ ప్రారంభానికి ఆయనే ఆద్యుడయ్యారు. ఆంటోనీ బౌర్డేన్ వయస్సు 61 సంవత్సరాలు. ఫ్రాన్స్ లోని ఓ హోటల్ రూంలో శవమై కనిపించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ప్రపంచంలోని అత్యధికంగా  వంటకాలను రుచి చూసిన వ్యక్తిగా ఆంటోనీ బౌర్డేన్ రికార్డ్ నెలకొల్పాడు. ఆయన తినని ఆహారమంటూ ఏదీ లేదని చెబుతారు. రుచికరమైన ఆహారమే కాదు... అత్యంత చెత్త ఫుడ్ కూడా తిన్న వ్యక్తి అతనే అని చెబుతారు. 1999లో డోంట్ ఈట్ బిఫోర్ రీడింగ్ దిస్ పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు. అది 2000 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన పుస్తకం. కిచెన్ కాన్ఫడెంటల్ పేరుతో రాసిన పుస్తకం ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. 

పలు ఛానల్స్ లో వంటలపై వేల ఎపిసోడ్స్ చేశారు బౌర్డేన్. ప్రపంచ మొత్తం తిరుగుతూ తాను చేసిన వంటలు, డ్రింక్స్ పై ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. సాధారణమైన స్టోరీ టెల్లర్ గా ప్రపంచానికి పరిచయం. ఆంటోనీ మరణంతో ఆప్తుడిని కోల్పోయాం అంటూ సీఎన్ఎన్ నెట్ వర్క్ సంతాపం తెలిపింది. ప్రపంచంలోని భోజన ప్రియులు, ప్రముఖ చెఫ్ లు ఆంటోనీ ఆత్మహత్యతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక నలభీముడు మధ్యలోనే తనవు చాలించటం ఎంతో బాధకలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బౌర్డేన్ రెండు వివాహాలు చేసుకుని ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. రెండేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. ఒంటరి తనం భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బౌర్డేన్ కు ఓ కూతురు కూడా ఉంది.