చిరుతతో సెల్ఫీ కోసం దిగి..

చిరుతతో సెల్ఫీ కోసం దిగి..

కౄర మృగాలను దూరం నుంచి చూడాలి తప్పించి దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసుకోవాలంటే ఏం జరుగుతుందనే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఫ్రెంచ్ జంట.  నెదర్లాండ్ లోని బీకేసీ బెర్గన్ సఫారీ పార్క్ కు టూరిస్ట్ గా వెళ్లిన ఓ ఫ్రెంచ్ జంట చిరుతలతో సెల్ఫీ దిగడానికి ఉత్సాహపడ్డారు.  చిన్న పిల్లను ఎత్తుకొని ఆ జంట దూరంగా ఉన్న ఓ చిరుత వద్దకు వెళ్లి సెల్ఫీ దిగబోయారు.  అంతే చుట్టుపక్కల ఉన్న చిరుతలు ఒక్కసారిగా దూసుకు వచ్చాయి.  ఈ హఠాత్ పరిమాణానికి షాక్ అయిన ఆ జంట ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగుపరుగున కారువైపు పరువులు తీశారు.  ఒక్క సెకను ఆలస్యమైనా.. ప్రాణాలు హరీ అనేవే.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.