హీరోయిన్ కాదు... నిర్మాతలే.. కానీ.. 

హీరోయిన్ కాదు... నిర్మాతలే.. కానీ.. 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతలుగా మారడం సహజమే. ఎందుకంటే హీరోలకు రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది.  ఈ రెమ్యునరేషన్ తో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు తీస్తుంటారు.  అదే హీరోయిన్లు అయితే.. రియల్ ఎస్టేట్, సౌందర్య ఉత్పత్తులు, ఇతర గోల్డ్ బ్రాండ్ వంటి వాటిపై పెట్టుబడులు పెడుతూ సంపాదిస్తుంటారు.  

కానీ, ఛార్మి మాత్రం అందుకు విరుద్ధంగా నిర్మాతగా మారింది.  ఇండస్ట్రీలో 50కి పైగా సినిమాల్లో నటించిన ఛార్మి, సినిమాల నుంచి తప్పుకున్నాక నిర్మాతగా మారిపోయింది.  పూరి కనెక్ట్ లో సహనిర్మాతగా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటోంది. పూరి, ఛార్మి కలిసి చాలా సినిమాలు చేశారు.  ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు హిట్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.  ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన హిట్ తో వారి లైఫ్ మారిపోయింది.  ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ సినిమా తీస్తున్నారు.  గోవాలో షూటింగ్ జరుగుతున్నది.  ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో ఛార్మి గోవా బీచ్ లో అద్భుతమైన ఫోజులు ఇచ్చింది.  ఆ ఫోటోలు చూస్తే.. రొమాంటిక్ హీరోయిన్ చార్మీనేమో అనిపిస్తుంది.