తప్పుడు కేసులు పెడుతున్నారు...డీజీపీకి బాబు లేఖ

తప్పుడు కేసులు పెడుతున్నారు...డీజీపీకి బాబు లేఖ

తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఏపీ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే కొందరు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారాయన. వైసీపీ నేతలను ప్రతీకారేచ్ఛకు పోలీసుల్ని పావులుగా వాడుకుంటోందని ఆరోపించారు. 

పోలీస్‌ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత ఆ విభాగాధిపతిగా డీజీపీ పైనే ఉందని అన్నారు బాబు. నియంతృత్వ రాజకీయాలకు పోలీసులు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలన్నారు. అయ్యన్న పాత్రుడిపై కేసు కూడా కుట్రలో భాగమన్నారు. డాక్టర్లు సుధాకర్‌, అనితారాణిల వ్యవహారంలో పోలీసుల తీరును ప్రజలంతా చూశారంటూ డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు బాబు.