పోలవరంతో రాష్ట్రం సస్యశ్యామలం: బాబు

పోలవరంతో రాష్ట్రం సస్యశ్యామలం: బాబు

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తన జీవితాశయమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. 2019 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పైలాన్‌ను ఇవాళ ఆయన ఆవిష్కరించారు. రూ.450 కోట్లతో 1400 మీటర్ల పొడవున భూమిలో నిర్మించిన ఈ వాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని అన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు.  పనులు వేగంగా పూర్తి చేస్తున్న ఇంజనీర్లను అభినందించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాను కష్టపడుతుంటే.. వైసీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు విమర్శించారు. వంశధార, నాగావళి, కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.