'ఛల్ మోహన్ రంగ' రన్ టైం...

'ఛల్ మోహన్ రంగ' రన్ టైం...

హీరో నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కలయికలో రూపొందిన చిత్రం ఛల్ మోహన్ రంగ. నితిన్ సరసన మేఘ ఆకాశ్ కథానాయికగా నటిస్స్తుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాను ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ 'ఛల్ మోహన్ రంగ' సినిమా తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 28 నిముషాలు ఉంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. తమన్ సంగీతం సమకూర్చిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్, త్రివిక్రమ్ లు కూడా ఈ సినిమాలో భాగం అయినందున ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు నితిన్. మరో వైపు ఈ సినిమాను యూఎస్ఏ లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.