హైదరాబాద్ ‌లో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

హైదరాబాద్ ‌లో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

 హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ప్రభావాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ముగిసింది. రోజంతా హైదరాబాద్‌లో బిజీబిజీగా గడిపిన సెంట్రల్‌ టీమ్ పలు ఆసుపత్రులను పరిశీలించింది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలతో పాటు గాంధీ, టిమ్స్ ఆసుపత్రులను సందర్శించింది. వైద్యశాఖాధికారులతో పాటు చీఫ్ సెక్రటరీతో కూడా కేంద్ర బృందం భేటీ అయింది. రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై వైద్య శాఖ అధికారులు డీటయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

రాష్ట్రంలో సర్వైలెన్స్, కంటైన్మెంట్ లో తీసుకుంటున్న చర్యలు , ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరస్ నివారణ చర్యల పై కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17,081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4,489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేశామని తెలిపారు. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇక కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం.

అలానే ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని కూడా పంచుకున్నట్టు చేబుతున్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు , వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు క్లినికల్ మెనేజ్ మెంట్ పై సూచనలు చేసింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచనలు చేశారు. అనంతరం ఢిల్లీ తిరుగు ప్రయాణమైంది టీమ్. హైదరాబాద్‌ లో కరోనా పరిస్థితిపై కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.